‘ప్రపంచంలోని అత్యంత పరాక్రమవంతమైన ఆర్మీ పాకిస్థాన్ ఆర్మీ’ అని ప్రియాంక గాంధీ అనలేదు


‘ప్రపంచంలోని అత్యంత పరాక్రమవంతమైన ఆర్మీ పాకిస్థాన్ ఆర్మీ’ అని ప్రియాంక గాంధీ వ్యాఖానించినట్లుగా చాలా మంది ఫేస్బుక్ పోస్టు లు పెడుతున్నారు. వాటిలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ప్రియాంక గాంధీ పాకిస్థాన్ ఆర్మీని ప్రపంచంలోని అత్యంత పరాక్రమవంతమైన ఆర్మీ అని పేర్కొన్నది.       

ఫాక్ట్ (నిజం): ప్రియాంక గాంధీ పాకిస్థాన్ ఆర్మీకి సంబంధించి పోస్టులో ఆరోపించిన వ్యాఖలు చేసినట్లుగా వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఎక్కడా కూడా ప్రచురించలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పాకిస్థాన్ ఆర్మీని ప్రపంచంలోని అత్యంత పరాక్రమవంతమైన ఆర్మీ గా ప్రియాంక గాంధీ పేర్కొన్నదా అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభించలేదు. ఒక వేల ప్రియాంక గాంధీ నిజంగానే అటువంటి సున్నితమైన వ్యాఖ్యలు చేసినట్లయితే దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలూ మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదు.

ప్రియాంక గాంధీ ఇలా అన్నది అని కేవలం గత రెండు-మూడు రోజులుగా మాత్రమే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కావున తను ఇలాంటి వాఖ్యలు గత మూడు వారాల్లో ఏమన్నా తన ట్విట్టర్ అకౌంట్ లో చేసిందా అని వెతకగా, అసలు పాకిస్తాన్ ఆర్మీ గురించి ట్విట్టర్ లో తను ఎటువంటి వాఖ్యలు చేయనట్టుగా తెలుస్తుంది. కావున, పోస్టులో ఆరోపించిన వ్యాఖ్యలు ప్రియాంక గాంధీ చేయలేదు.

చివరగా, ప్రియాంక గాంధీ పాకిస్థాన్ ఆర్మీని ప్రపంచంలోని అత్యంత పరాక్రమవంతమైన ఆర్మీ అని పేర్కొనలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


The post ‘ప్రపంచంలోని అత్యంత పరాక్రమవంతమైన ఆర్మీ పాకిస్థాన్ ఆర్మీ’ అని ప్రియాంక గాంధీ అనలేదు appeared first on FACTLY.

Go to Source
Author: Rakesh Vuppu

Categories

News Categories

Ads Banner

Social Profile